logo

‘అప్పులతో అన్నదాతల ఆత్మహత్యలు’

సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తానని చెప్పి నేటికీ అమలు చేయలేదని, దీంతో అన్నదాతలు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెదేపా నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఎల్‌.వి.యాదవ్‌ అన్నారు.

Published : 27 Mar 2023 03:16 IST

చందనపల్లిలో తెదేపా అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్న నాయకులు ఎల్‌వీ యాదవ్‌, వెంకటేశ్వర్లు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు రైతులకు రూ.లక్ష రుణ మాఫీ చేస్తానని చెప్పి నేటికీ అమలు చేయలేదని, దీంతో అన్నదాతలు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెదేపా నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ ఎల్‌.వి.యాదవ్‌ అన్నారు. నల్గొండ మండలం చందనపల్లిలో ఆదివారం ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో భాగంగా పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హమాంలో  ప్రజలకు చేసిన అభివృద్ధి విషయాలను వివరించారు. ఎస్‌ఎల్‌బీసీ కాల్వల ద్వారా గ్రామాలు సస్యశ్యామలం చేసిన ఘనత తెదేపాదే అన్నారు. నల్గొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కృష్ణా నీరు అందించామన్నారు. తెదేపా చేసిన అభివృద్ధి ఫలాలే గ్రామాల అభివృద్ధికి కారణమన్నారు. నేటి భారాస ప్రభుత్వం కాల్వలు కూడా మరమ్మతు చేయించలేని స్థితిలో ఉందన్నారు. నిరుద్యోగులతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని విమర్శించారు. తెదేపా జిల్లా నాయకులు పాలడుగు నాగరాజు, గుండు వెంకటేశ్వర్లు, రఫిక్‌, పరమేష్‌, క్రాంతి కుమార్‌, తిరుపతయ్య పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని