యాదాద్రిలో భక్తజన సందడి
యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జంట నగరాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన యాత్రికుల రాకతో క్షేత్ర పరిసరాలు కోలాహలంగా మారాయి.
యాదాద్రీశుడి సన్నిధిలో భక్తుల కోలాహలం
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జంట నగరాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన యాత్రికుల రాకతో క్షేత్ర పరిసరాలు కోలాహలంగా మారాయి. వేకువ జాము నుంచే కొండపై ఆలయ ప్రాంగణాలు భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మికత అలముకున్నాయి. దైవదర్శనం, ప్రసాదాల కొనుగోలుకు భక్తులు బారులు తీరి కనిపించారు. ఆలయ ద్వారాలు తెరిచి, సుప్రభాతం నిర్వహించారు. మూలవరులకు నిజాభిషేకం, అర్చనలు జరిపారు. అభయమిస్తూ, ఆశీర్వదించే కవచమూర్తులకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. అష్టోత్తర పర్వాన్ని కొనసాగించారు. శ్రీ సుదర్శన హోమం, నిత్యకల్యాణం చేపట్టిన భక్తులకు ప్రసాదాలతో సహ ఆశీస్సులు అందజేశారు. సాయంత్రం అలంకార సేవోత్సవం నిర్వహించి మాడవీధుల్లో భక్తుల సందర్శనార్థం ఊరేగించారు. రాత్రివేళ స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన జరిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు హరి, హర ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. శివాలయాన్ని సందర్శించిన భక్తులు శ్రీరామనవమి వేడుకలను తిలకించారు.
రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్‌రెడ్డి, కుటుంబీకులను ఆశీర్వదిస్తున్న పూజారి
యాదాద్రీశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. దైవారాధనల్లో పాల్గొన్న న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబీకులకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులను పండితులు, దేవుడి ప్రసాదాన్ని ప్రొటోకాల్ ఏఈవో రామ్మోహన్‌రావు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Jerusalem: 22ఏళ్లు ‘కోమా’లోనే .. ఆత్మాహుతి దాడిలో గాయపడిన మహిళ మృతి
-
Politics News
Maharashtra: సీఎం ఏక్నాథ్ శిందేతో శరద్ పవార్ భేటీ.. రాజకీయ వర్గాల్లో చర్చ!
-
India News
Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్ అరెస్టు!
-
India News
New Parliament Building: నూతన పార్లమెంట్లో ఫౌకాల్ట్ పెండ్యులమ్.. దీని ప్రత్యేకత తెలుసా?
-
Movies News
Ajay: ‘డోంట్ టచ్’ అంటూ ఆమె నాపై కేకలు వేసింది: నటుడు అజయ్
-
India News
Fishermen: 200 మంది భారత జాలర్లకు పాక్ నుంచి విముక్తి!