logo

అన్నిరంగాల్లో పేట పట్టణాభివృద్ధి

సూర్యాపేట పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ కోరారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు.

Published : 01 Jun 2023 03:11 IST

సూర్యాపేట మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, చిత్రంలో కమిషనర్‌ రామాంజులరెడ్డి, ఈఈ జి.కె.డి.ప్రసాద్‌

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: సూర్యాపేట పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ కోరారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఆమె మాట్లాడారు. సూర్యాపేటను అన్నిరంగాల్లో ముందుంచేలా అభివృద్ధి పరుస్తున్నామని చెప్పారు. గతంలో కంటే ప్రస్తుతం ఎంతో ప్రగతి సాధించిందని పేర్కొన్నారు. రహదారులు గుంతలమయంగా మారాయని, మురుగు వ్యవస్థ సరిగా లేదని, నీటి సమస్య తలెత్తుకుండా చూడాలని పలువురు కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఛైర్‌పర్సన్‌ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కౌన్సిల్‌ ఎజెండాలో పొందుపరిచిన అంశాలను కౌన్సిల్‌ సభ్యులు ఆమోదించారు. సమావేశంలో పుర కమిషనర్‌ రామాంజులరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ పుట్ట కిశోర్‌, ఈఈ జి.కె.డి.ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

శుద్ధ జలాలు ప్రకటనకే పరిమితం: కాంగ్రెస్‌

పట్టణంలో అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతోందని కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కక్కిరేణి శ్రీనివాస్‌ ఆరోపించారు. కౌన్సిల్‌ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీధుల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, మురుగు కాల్వల్లో పూడిక సరిగా తీయడం లేదన్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా ప్రకటనలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో సరిగా నీళ్లు రావడం లేదన్నారు. నర్సరీల్లో మొక్కలు పెంచకుండా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కౌన్సిలర్లు షఫి ఉల్లా, బైరు శైలేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని