logo

నేడు భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. దీనికి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు,

Published : 26 May 2022 03:22 IST

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. దీనికి ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర పదాదికారులతో పాటు పార్టీ జాతీయస్థాయి పదాధికారులుగా ఉన్న రాష్ట్ర నాయకులు, పార్టీ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రముఖ నాయకులు తదితరులు సమావేశంలో పాల్గొననున్నారు. 20 ఏళ్ల తర్వాత భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరులో జరుగుతుండటంతో జిల్లా నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నగరంలో పలు ప్రధాన మార్గాలు, కూడళ్లలో భాజపా జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం అక్కడ నుంచి నగరంలోని వీర్సీ కూడలి వరకు శోభాయాత్ర జరగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని