logo

కలెక్టర్‌ గారూ.. అవార్డులు మాకెందుకివ్వరు?

వర్క్‌ఛార్జ్‌డ్‌ ఉద్యోగులకు అవార్డులు ఇవ్వకుండా ఎందుకు విస్మరిస్తున్నారని ర.భ. శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 29 Jan 2023 01:35 IST

నెల్లూరు(జడ్పీ),: వర్క్‌ఛార్జ్‌డ్‌ ఉద్యోగులకు అవార్డులు ఇవ్వకుండా ఎందుకు విస్మరిస్తున్నారని ర.భ. శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆశాఖ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌బాబు, కె.శంకరన్‌బాబు ఓ లేఖ విడుదల చేశారు. రాత్రనకా, పగలనకా రోడ్లపై చెమట చిందించి విధులు నిర్వహిస్తున్న గ్యాంగ్‌ మెన్స్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, డ్రైవర్లు, వాచ్‌మెన్‌లు, తదితర సిబ్బందికి ప్రభుత్వం గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకలకు అవార్డులు ఎందుకు ఇవ్వడంలేదని పేర్కొన్నారు. ఈ లేఖలను కలెక్టర్‌ నుంచి ఈఎన్‌సీ వరకు పంపుతున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని