logo

శిరస్త్రాణంతో ప్రాణరక్షణ

శిరస్త్రాణం ధరించండి.. ప్రాణరక్షణ పొందండి.. అంటూ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు.

Published : 24 Mar 2023 05:14 IST

ట్రాఫిక్‌ పోలీసుల ర్యాలీ

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే : శిరస్త్రాణం ధరించండి.. ప్రాణరక్షణ పొందండి.. అంటూ ట్రాఫిక్‌ పోలీసులు వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు సహకరించాలని కోరుతూ నినాదాలు చేశారు. నగర ట్రాఫిక్‌ డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ పోలీసులందరూ ద్విచక్ర వాహనాలపై నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నార్త్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.నాగేశ్వరమ్మ, సౌత్‌ ట్రాఫిక్‌ ఆర్‌ఐ రమణారెడ్డి, ఆర్‌ఎస్సైలు, ఎస్సైలు, ట్రాఫిక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని