logo

అధికారులు గైర్హాజరైతే ఎలా..?

మూడునెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు గైర్హాజరైతే ఎలా అని సీతారామపురం-1 ఎంపీటీసీ సభ్యుడు పాలగిరి చిన్నఅల్లూరురాజు అధికారులను ప్రశ్నించారు. 

Published : 30 Mar 2023 03:46 IST

సమస్యలపై ప్రశ్నిస్తున్న  ఎంపీటీసీ సభ్యుడు అల్లూరురాజు

సీతారామపురం, న్యూస్‌టుడే: మూడునెలలకోసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు గైర్హాజరైతే ఎలా అని సీతారామపురం-1 ఎంపీటీసీ సభ్యుడు పాలగిరి చిన్నఅల్లూరురాజు అధికారులను ప్రశ్నించారు.  సీతారామపురం మండల సర్వసభ్యసమావేశం బుధవారం ఎంపీపీ పద్మావతి అధ్యక్షతన జరిగింది. ఎంపీడీవో, తహసీల్దారు, ఎంఈవో తదితరులు హాజరు కాకపోవడంతో అల్లూరురాజు అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో సమావేశానికి మండలస్థాయి అధికారులు తరలివెళ్లారని ఎంపీపీ పద్మావతి, ఏవో వెంకటేశ్వరరావు ఆయనకు సర్దిచెప్పారు. ఉపాధిపనుల విషయమై అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని, కొందరు అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని నెమళ్లదిన్నె సర్పంచి రామచంద్ర, పోలంగారిపల్లి సర్పంచి వెంకటసుబ్బయ్య ధ్వజమెత్తారు. నాడు-నేడు, ఉపాధిహామీ పనులు, గృహనిర్మాణ శాఖ పనులపై పలువురు సభ్యులు ఆయాశాఖల అధికారులను ప్రశ్నించారు. జడ్పీటీసీ సభ్యుడు చెరుకుపల్లి  రమణారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని