logo

ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ హెచ్చరించారు.

Published : 29 Mar 2024 03:14 IST

కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), ఆత్మకూరు, సంగం, ఉదయగిరి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ హెచ్చరించారు. గురువారం ఆయన ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. తొలుత ఉదయగిరి మేకపాటి గౌతంరెడ్డి ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్‌, కోవూరు నియోజకవర్గంలోని గీతాంజలి ఇంజినీరింగ్‌ కళాశాల, నెల్లూరు వీఆర్‌ కళాశాల, డీకేడబ్ల్యూ కళాశాలలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 15వేల మంది పోలింగ్‌ సిబ్బందిని, మరో వేయి మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 12 మంది అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైనర్లను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సంగం జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి.. ఓటర్లకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు, నెల్లూరురూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ప్రేమ్‌కుమార్‌, మధులత, సేతు మాధవన్‌, వికాస్‌ మర్మత్‌, మాలోల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు