logo

తెదేపాపై వివక్ష.. యువతకు శిక్ష

జిల్లాలో యువతకు ఉపాధి కరవైంది. ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అయిదేళ్లుగా కొత్తగా పరిశ్రమలు రాలేదు.

Published : 17 Apr 2024 03:48 IST

జిల్లాలో యువతకు ఉపాధి కరవైంది. ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అయిదేళ్లుగా కొత్తగా పరిశ్రమలు రాలేదు. దీంతో చదువుకున్నవారు నిరుద్యోగులుగా మారుతున్నారు. కనీసం నైపుణ్య శిక్షణలు కూడా ఇవ్వడం లేదు. దీంతో యువత ఉపాధి కరవై జీవనం భారంగా గడుపుతోంది.

న్యూస్‌టుడే బృందం


నాలుగేళ్లుగా ఇంటి వద్ద ఉంటున్నా

  శశికుమార్‌, నార్తుమోపూరు 

నాకు డిగ్రీ పూర్తయింది. ఉద్యోగం చేసేందుకు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. దీంతో  ఇంటి దగ్గరే ఉంటున్నాను. మా నాన్నతో పాటు పొలం పనికి పోతున్నాను.


యువతకు వలసలు తప్పడం లేదు

ఎన్‌.జయరామ్‌, వ్యాపారి

స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక.. పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు లభిస్తాయి.


దురుద్దేశంతోనే పరిశ్రమలు తరలింపు: 

 ఎం.సాయికృష్ణ, ప్రైవేటు అధ్యాపకుడు

చంద్రబాబునాయుడు రామాయపట్నం ఓడరేవుకు అనుబంధంగా ఏషియన్‌ పేపరు పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. దీన్ని సీఎం జగన్‌ తరిమేశారు. సదరు పరిశ్రమ ఏర్పాటైతే యువతకు వేలాదిగా ఉద్యోగాలు లభించేవి. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు.


ఉద్యోగాలేవీ?

- ఎర్రంశెట్టి ఉదయకుమార్‌, కావలి

ప్రస్తుత వైకాపా పాలనలో పరిశ్రమలు ఏర్పాటుకాలేదు. దీంతో యువతకు ఉద్యోగావకాశాలు తగ్గిపోయాయి. పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తే ఉద్యోగాలు వస్తాయి. కేవలం వాలంటీరు పోస్టులను కట్టబెట్టి యువతను మభ్యపెట్టేందుకు మాత్రమే పాలకులు పరిమితమయ్యారు. ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. జాబ్‌ క్యాలెండర్‌ అంశంలోనూ మాట తప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని