logo

సమస్యలు..పట్టని వైకాపా పాలకులు

ఇందిరానగర్‌ కాలనీ, ఎస్సీ కాలనీ, సినిమాహాల్‌ సెంటర్‌, శ్రీనగర్‌ కాలనీ, మంగళికట్ట, యూనియన్‌ రోడ్డు సమస్యలు: తాగునీటి సరఫరా, రోడ్లపై చెత్తకుప్పలు, పూడిక చేరిన మురుగు కాలువలు తదితర సమస్యలు వేధిస్తున్నాయి.

Published : 17 Apr 2024 03:51 IST

ఉదయగిరి, న్యూస్‌టుడే: పంచాయతీ: ఉదయగిరి .. వార్డులు: 1,2,3,4 

పూడిక తీయని కాలువ

ప్రాంతాలు: ఇందిరానగర్‌ కాలనీ, ఎస్సీ కాలనీ, సినిమాహాల్‌ సెంటర్‌, శ్రీనగర్‌ కాలనీ, మంగళికట్ట, యూనియన్‌ రోడ్డు సమస్యలు: తాగునీటి సరఫరా, రోడ్లపై చెత్తకుప్పలు, పూడిక చేరిన మురుగు కాలువలు తదితర సమస్యలు వేధిస్తున్నాయి. ఆయా కాలనీల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు.  నీటి సరఫరా నాలుగు రోజులకొకసారి చేస్తున్నారు. చెత్తాచెదారం వేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 1983లో ఏర్పాటు చేసిన పక్కా గృహాలు దెబ్బతిన్నాయి. దీంతో పేదలు ఆ ఇళ్లలో ఉండలేకపోతున్నారు. రోడ్లు కంకర లేచి ప్రమాదకరంగా ఉన్నాయి. - శ్రీనగర్‌ కాలనీలో కుళాయిలకు నీటి సరఫరా మూడు రోజులకొకసారి వస్తోంది. సీసీ రోడ్లు కొన్నిచోట్ల దెబ్బతిన్నాయి.  మంగళికట్ట వీధిలో రోడ్లు దుస్థితికి చేరాయి.


పట్టించుకునేవారు లేరు

- కె.లక్ష్మీదేవి

ఇందిరానగర్‌ కాలనీలో సమస్యలతో సతమతమవుతున్నాం. అయినా నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కాలువలే లేవు. ఉన్న వాటిని శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి.  చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన కాలనీలు శిథిలావస్థకు చేరడంతో ప్రస్తుతం వాటిల్లో నివసించలేకపోతున్నారు.  


పరిష్కరించేవారు ఏరీ 

 - ఉయ్యాల రమాదేవి

స్థానిక సమస్యల గురించి చెప్పినా ఆలకించేవారు లేరు. ఎన్నికల సమయంలో గొప్పలు చెబుతూ అనంతరం పట్టించుకోవడంలేదు. నీటి సరఫరా సరిగా లేదు. కనీసం చెత్త వేసుకునేందుకు స్థలం కూడా లేదు. సమస్యలతో పేదలు సతమతమైపోతోన్న ఆలకించే నాథులే లేకుండా పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని