logo

కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 18 Apr 2024 03:26 IST

నియమావళి ఉన్నా బేఖాతరు

నిల్వ చేస్తున్న సముద్రపు ఇసుక

కావలి, న్యూస్‌టుడే : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది నిర్మాణాలకు పనికిరాదు. వైకాపా పాలనలో ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కావలి మండలంలోని సముద్రతీరం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదులు, వాగుల నుంచి తీసుకొచ్చిన ఇసుకలో కలుపుతున్నారు.  కొన్నేళ్లుగా ఈప్రాంతంలో యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని భవన నిర్మాణాలకు వినియోగించడంతో అనతికాలంలోనే దెబ్బతింటున్నాయి.

  • పట్టణంలో ఏర్పాటుచేసిన జగనన్న మెగా లేఅవుటË్లో ఇళ్ల నిర్మాణాలకు సముద్రపు ఇసుకనే ఎక్కువగా వినియోగించారనే విమర్శలున్నాయి. దీంతో ఓ వైపు నిర్మాణాలు జరుగుతుండగా మరోవైపు దెబ్బతింటున్నాయి. గత ఏడాది డిసెంబరులో వచ్చిన వర్షాలకు కూలిపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కూడా సముద్రపు ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధవారం ఉదయం కావలి మండలంలోని నందెమ్మపురం సమీపంలో తరలిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పొక్లెయినర్లు, టిప్పర్లను ఏర్పాటుచేసి దందా సాగిస్తున్నారు. భారీ డంప్‌ను ఏర్పాటు చేసుకుని  తరలిస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై కావలి గ్రామీణ సీఐ కావేటి శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఫిర్యాదులు రావడం వాస్తవమేనని వివరించారు. అయితే, అక్కడకు వెళ్లి చూడగా ఆప్రాంతం పొరుగు స్టేషన్‌ గుడ్లూరు పరిధిలోకి వస్తుందన్నారు. దీంతో ఆ స్టేషన్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని