logo

నామినేషన్లకు వేళాయే

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్‌సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది.

Published : 18 Apr 2024 03:30 IST

నేటి నుంచి 25వ తేదీ వరకు అవకాశం

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్‌సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. కీలక ఘట్టం నామపత్రాల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ఆర్వో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియ.. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా(21 ఆదివారం).. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సాగనుంది. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కలెక్టరేట్‌లో స్వీకరించనుండగా- అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసేవారు.. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఆర్వో కేంద్రాల్లో వేయనున్నారు. నామినేషన్‌ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురిని కేంద్రంలోకి అనుమతించనున్నారు.

సన్నద్ధమవుతున్న అభ్యర్థులు..

18వ తేదీ కోవూరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న తెదేపా, వైకాపా అభ్యర్థులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి; కావలిలో వైకాపా అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ వేస్తుండగా- 19న కావలి తెదేపా అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి దాఖలు చేస్తారు. 22న ఉదయగిరి నుంచి తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్‌, ఆత్మకూరు తెదేపా, వైకాపా అభ్యర్థులు ఆనం రామనారాయణరెడ్డి, విక్రమ్‌రెడ్డి నామపత్రాలు సమర్పిస్తారు. ఇదే రోజు నెల్లూరు రూరల్‌ వైకాపా అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు నగరం నుంచి నారాయణతో పాటు నెల్లూరు తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ వేయనున్నారు. 23వ తేదీ ఇంటూరి నాగేశ్వరరావు(కందుకూరు తెదేపా), 24న వైకాపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, కందుకూరు నుంచి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన వారివి ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు