logo

హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ

హ్యాండ్‌బాల్‌.. జిల్లాలో ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటి. దీనిపై ఆసక్తితో స్థానిక క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జాతీయస్థాయి వరకు వెళ్లారు.

Published : 02 Feb 2023 03:36 IST

జాతీయస్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ క్రీడావిభాగం

సాధన చేస్తున్న పిల్లలు

హ్యాండ్‌బాల్‌.. జిల్లాలో ఆదరణ పొందుతున్న క్రీడల్లో ఒకటి. దీనిపై ఆసక్తితో స్థానిక క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ జాతీయస్థాయి వరకు వెళ్లారు. తొలుత పీఈటీలు వెంకట్‌, నాగరాజ్‌ సంఘాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం శిక్షకుడు అన్వర్‌ 20 ఏళ్లుగా శిక్షణ కొనసాగించారు. ఆయన నేతృత్వంలో పలువురు భారతజట్టు ప్రాబబుల్స్‌ వరకు వెళ్లొచ్చారు.

భారతజట్టులో చోటే లక్ష్యం
రాహుల్‌, గిరిరాజ్‌ కళాశాల

హ్యాండ్‌బాల్‌లో అయిదేళ్లుగా సాధన చేస్తున్నా. గతేడాది డిసెంబరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి గుజరాత్‌లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాను. అక్కడ ప్రదర్శన బాగుండటంతో సీనియర్‌ మెన్‌ ఫెడరేషన్‌ కప్‌ పోటీలకు అర్హత సాధించా. భారతజట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా శ్రమిస్తున్నా.

నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నా
నవనీత, సాంఘిక సంక్షేమ జూనియర్‌ కళాశాల ధర్మారం(బి), నిజామాబాద్‌

గత మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా. రాష్ట్రస్థాయి జూనియర్‌ ఉమెన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించా. గత నెల 12, 13, 14వ తేదీల్లో రాజస్థాన్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నా. అక్కడ రాష్ట్ర జట్టు విజయం సాధించకపోయినా.. భవిష్యత్తులో రాణించేలా నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నా.

రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించా
సాయికుమార్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి

పాఠశాలస్థాయి నుంచే క్రీడలంటే ఇష్టం. కళాశాల స్థాయిలో ఈ ఆటపై శిక్షణ తీసుకోవడం ప్రారంభించా. రాష్ట్రస్థాయిలో పలు పతకాలు అందుకున్నా. గత నెల 26 నుంచి 29వ తేదీ వరకు తమిళనాడులో నిర్వహించిన జాతీయస్థాయి జూనియర్‌ మెన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలో పాల్గొన్నా. భారతజట్టుకు ఆడేలా సాధన చేస్తున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని