logo

కర్ణాటకలో జిల్లా దంపతుల బలవన్మరణం

నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 29 Mar 2024 05:05 IST

ఆధార్‌ కార్డుల ఆధారంగా గుర్తింపు

నిజామాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే : నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్‌పేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి (54) కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌ నగరానికి వలస వచ్చారు. గాయత్రినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా సంతానం లేక మానసికంగా కుంగిపోయారు. పైగా వీరికి సరైన ఉపాధి లేక అప్పులపాలయ్యారు. అవి తీర్చే మార్గం లేక నాలుగేళ్ల కిందట నగరాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇక్కడ బంధువులు ఎవరూ లేకపోవడంతో వారు ఎటు వెళ్లారో తెలియదు. బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆధార్‌ కార్డుల్లో నిజామాబాద్‌ చిరునామా ఉన్నట్లు గుర్తించిన కర్ణాటక పోలీసులు ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అయితే వీరు గత రెండున్నర నెలలుగా లాడ్జిలోనే ఉంటున్నారని, ఎప్పటికప్పడు బిల్లులు చెల్లిస్తూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటించేవారని లాడ్జి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరి వివరాలు సేకరించేందుకు గాయత్రినగర్‌కు వెళ్లగా లభ్యం కాలేదని నాలుగో ఠాణా ఎస్సై సంజీవ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని