logo

ప్రశ్నపత్రం లీక్‌.. ఉపాధ్యాయుడి అరెస్టు

గుజరాత్‌లో పంచాయతీ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ నిర్వహించనున్న జూనియర్‌  క్లర్క్‌ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్‌ అయిన ఘటనలో మల్కాన్‌గిరి జిల్లా మథిలి సమితి కర్తనపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సరోజ్‌ మల్లును ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Published : 01 Feb 2023 03:43 IST

అరెస్టయిన సరోజ్‌ మల్లుతో పోలీసులు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: గుజరాత్‌లో పంచాయతీ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ నిర్వహించనున్న జూనియర్‌  క్లర్క్‌ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్‌ అయిన ఘటనలో మల్కాన్‌గిరి జిల్లా మథిలి సమితి కర్తనపల్లి ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు సరోజ్‌ మల్లును ఆ రాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కొన్ని రోజుల కిందట ఆ రాష్ట్రంలో పంచాయతీ విభాగంలో 1181 జూనియర్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. పరీక్ష తేదీకి ముందే ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి.  దీంతో చివరి క్షణాల్లో పరీక్షను రద్దు చేశారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేసి నిందితులైన 15మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కర్తనపల్లి ఉపాధ్యాయుడి హస్తం ఉందని దర్యాప్తులో తేలింది. సమాధానపత్రం మల్కాన్‌గిరి నుంచి వచ్చినట్లు పోలీసులు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. తమ రాష్ట్రంలో విచారించి, న్యాయస్థానానికి తరలిస్తామని తెలిపారు. గుజరాత్‌ పోలీసుల ప్రాథమిక నివేదిక ఆధారంగా మల్కాన్‌గిరి పోలీసులు సహకరించి సరోజ్‌ మల్లును అరెస్టు చేశారని స్థానిక ఎస్‌.పి.నితీశ్‌ వాద్వానీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని