logo

రెండుచోట్ల నవీన్‌ పోటీ

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బొలంగీర్‌ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు.

Published : 18 Apr 2024 05:35 IST

9 మందితో బిజద అయిదో జాబితా
ఆరుగురు మహిళలకు అవకాశం

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ బొలంగీర్‌ జిల్లా కంటాబంజి, గంజాం జిల్లాలోని హింజిలి నుంచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తారు. బుధవారం తొమ్మిది శాసనసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ఆయన ప్రకటించారు. గంజాం జిల్లాలోని హింజిలి ఆయన ప్రస్తుత నియోజకవర్గం. ఇక్కడి నుంచి అయిదుసార్లు గెలిచిన నవీన్‌ ఈసారి దీనికి అదనంగా కంటాబంజి నుంచి పోటీ చేస్తారు. 2019 ఎన్నికల్లోనూ సీఎం హింజిలి, బరగఢ్‌ జిల్లా బిజెపూర్‌ నుంచి విజయం సాధించారు. తర్వాత బి.జె.పూర్‌ను వదులుకున్న సంగతి తెలిసిందే.

బిజద అసెంబ్లీ అభ్యర్థులు వీరే

లక్ష్మీప్రియనాయక్‌ (చిత్రకొండ), బర్షాసింగ్‌ బరిహ (పదంపూర్‌), రాజేంద్ర ఛత్రియా (కుచిండ), అరుంధతి దేవి (దేవ్‌గఢ్‌), సంజుక్తా సింగ్‌ (అనుగుల్‌), దిలీప్‌ నాయక్‌ (నియపడ), గీతాంజలి దేవి (సన్నోఖెముండి), ఇందిరానందో (జయపురం)లు బిజద నుంచి పోటీ చేయనున్నారు.

భాజపాను అడ్డుకోవడానికే..

పశ్చిమ ఒడిశా ప్రాంతాల్లో మోదీ హవా వీస్తోందన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీన్ని నిలువరించడానికి సీఎం కంటాబంజి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులంటున్నారు. సంబల్‌పూర లోక్‌సభ స్థానానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పోటీ చేస్తున్నారు. బిజదకు ఆయన సవాల్‌ విసురుతున్నారు. దీన్ని అడ్డుకోవడానికి సీఎం దేవ్‌గఢ్‌ రాణి అరుంధతీదేవిని దేవ్‌గఢ్‌లో నిలబెట్టి, తాను పశ్చిమ ఒడిశా బరిలోకి దిగారు. అయిదో జాబితాలో ప్రకటించిన తొమ్మిది మందిలో ఆరుగురు మహిళలున్నారు. సీఎంకు విధేయునిగా ఉన్న ప్రసన్న ఆచార్యకు ఇదివరకు సంబల్‌పూర్‌ స్థానం కేటాయించారు. ప్రసన్న కోర్కె మేరకు రెఢాఖోల్‌ నుంచి, మాజీ మంత్రి రోహిత్‌ పూజారిని సంబల్‌పూర్‌ బరిలో దించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని