సాలూరు వైకాపాలో వర్గ విభేదాలు
సంస్థాగత పదవుల ఎంపికలో వైకాపా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర నివాసంలో వైకాపా పట్టణ నేతలు సమావేశమయ్యారు.
సాలూరు, న్యూస్టుడే: సంస్థాగత పదవుల ఎంపికలో వైకాపా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. శుక్రవారం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర నివాసంలో వైకాపా పట్టణ నేతలు సమావేశమయ్యారు. ప్రస్తుత పార్టీ పట్టణ అధ్యక్షుడు జె.సూరిబాబునే కొనసాగించాలా లేదా అని ఉప ముఖ్యమంత్రి స్థానిక నాయకులను అడగగా మార్చాలన్నారు. పాచిపెంట, మక్కువ మండలాల్లో పాత అధ్యక్షులనే కొనసాగిస్తున్నామని, ఇక్కడ కూడా అలాగే చేయాలని రాజన్నదొర అభిప్రాయం వ్యక్తం చేశారు. వెలమ, కాపు సామాజిక వర్గాలను కాదని పాత నేతనే ఉంచే కంటే యువ నాయకుడు గోవిందకు పదవి ఇవ్వాలని పలువురు తమ అభిప్రాయం వెల్లడించారు. ఎవరు ఉండాలో.. ఎవరు ఉంటే పార్టీకి మంచిదో మీరు నిర్ణయించుకోండని రాజన్నదొర ఇంట్లోకి వెళ్లిపోయారు. తర్వాత కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని నేతలకు సూచించారు. అనంతరం నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. వెలమలకు ఇస్తే పురపాలక వైస్ ఛైర్మన్ వంగపండు అప్పలనాయుడు, కాపు సామాజిక వర్గానికి అయితే సీనియర్ నేత గొర్లె జగన్కు ఇవ్వాలని పలువురు కోరారు. కాదు పాత అధ్యక్షుడినే కొనసాగించాలని పువ్వల నాగేశ్వరరావు వ్యతిరేక వర్గం కోరింది. దీంతో నేతల మధ్య మాటామాట పెరిగి తోపులాటకు దారితీసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sundeep Kishan: రిలేషన్షిప్ నాకు సెట్ కాదు.. బ్రేకప్ దెబ్బ గట్టిగా తగిలింది: సందీప్ కిషన్
-
World News
Pervez Musharraf: ‘కార్గిల్’ కుట్ర పన్ని.. పదవి కోసం నియంతగా మారి..!
-
General News
Tirumala: నూతన పరకామణిలో శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు.. భక్తులు చూసేలా ఏర్పాట్లు
-
World News
Musharraf: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత!
-
Movies News
Bobby: త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా..: దర్శకుడు బాబీ
-
Politics News
Aaditya Thackeray: రాజీనామా చేసి నాపై పోటీ చెయ్.. సీఎంకు ఆదిత్య సవాల్!