logo

స్లాబు కూలింది.. ముప్పు తప్పింది

పాలకొండలోని అగ్నిమాపక కేంద్రం పైకప్పు మధ్యభాగం విరిగి పడింది. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో స్లాబు కూలిపోయింది.

Published : 26 Mar 2023 06:05 IST

పాలకొండలోని అగ్నిమాపక కేంద్రం పైకప్పు మధ్యభాగం విరిగి పడింది. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో స్లాబు కూలిపోయింది. ఆ సమయానికి అక్కడెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ భవనం కొన్నేళ్లుగా శిథిలావస్థలో ఉన్నా వాహనాన్ని పెడుతున్నారు. నూతన భవన నిర్మాణానికి రూ.1.16 కోట్ల నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. ఈక్రమంలో భయాందోళనల నడుమే సిబ్బంది విధులు నిర్వహించేవారు. ఈక్రమంలోనే ఈ ఘటన జరిగింది. పోలీస్‌ హౌసింగ్‌ బోర్డువారు పనులు చేయాల్సి ఉందని, వారి దృష్టికి తీసుకెళ్తామని సంబంధిత అధికారి బదులిచ్చారు.     

 న్యూస్‌టుడే, పాలకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు