logo

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 28 Mar 2024 04:26 IST

సూచనలు చేస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. బుధవారం ఆయన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగానే సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి, సెక్టార్ల ప్రకారం వాటిని విభజించి ప్రత్యేక అధికారులను నియమించాలని, అక్కడ అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించాలని ఎస్పీ సూచించారు.ఎన్నికల బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన కేంద్ర పోలీసు దళం, ఆర్‌పీఎఫ్‌తో జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ల అధికారులు సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కవాతు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి పౌరుడు ఓటుహక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేందుకు పటిష్ఠభద్రత చర్యలు తీసుకోవాలన్నారు. గత కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. చెక్‌పోస్టుల వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టాలని సూచించారు. మద్యం, నగదు అక్రమ తరలింపు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సునీల్‌ షరోన్‌, డీఎస్పీలు హర్షిత, కృష్ణారావు, మురళీధర్‌, వెంకట అప్పారావు, శిక్షణ డీఎస్పీ ఎస్‌ఎండీ అజీజ్‌, ఎస్బీ సీఐ లక్ష్మణరావు, డీసీఆర్‌బీ సీఐ బీఎండీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

హాజరైన పోలీసు అధికారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని