logo

మూలకు చేరిన మూడు చక్రాల ఆటోలు

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మంజూరు చేసిన మూడు చక్రాల ఆటోలు కొన్ని చోట్ల మూలకు చేరాయి.

Published : 28 Mar 2024 18:44 IST

బలిజిపేట: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మంజూరు చేసిన మూడు చక్రాల ఆటోలు కొన్ని చోట్ల మూలకు చేరాయి. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ చేపట్టి వీటిని చెత్తశుద్ధి కేంద్రాలకు తరలించేందుకు బలిజిపేట మండలంలోని ఏడు గ్రామపంచాయతీలకు ఎస్సీ కార్పొరేషన్‌, పంచాయతీరాజ్‌శాఖలు సంయుక్తంగా ఏడు ఆటోలు మంజూరు చేశాయి. వీటికి సాంకేతిక లోపాలు ఏర్పడినందున బలిజిపేటకు చెందిన ఈ ఆటో ఆరంభం నుంచి సచివాలయం ఆవరణలోనే మూలన పడి ఉంది. ఇందుకు ప్రభుత్వం వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి. ఈ విషయం గురించి పంచాయతీ కార్యదర్శి ఆదిలక్ష్మిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా, ఈ విషయం ఎస్సీ కార్పొరేషన్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని