logo

వాన కాదు.. వల్లకాడుకు దారి లేదు

గజపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు.

Published : 29 Mar 2024 03:59 IST

నీటిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న బంధువులు, కుటుంబ సభ్యులు

జపతినగరంలో రైల్వే మూడో లైను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల్లో స్థానిక రాళ్ల చెరువుకు సంబంధించిన కల్వర్టును రైల్వే అధికారులు పొరపాటున కప్పేయడంతో సమీపంలోని రైల్వే కాలనీ వాసులు, రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఇటీవల రబీ కోసం చెరువు నీటిని విడుదల చేయగా.. పరిసర ప్రాంతాలతో పాటు, సమీప పొలాలు నిండిపోయాయి. ఈ మార్గంలోనే శ్మశానవాటిక ఉండటంతో గురువారం అనారోగ్యంతో మృతిచెందిన ఓ వృద్ధుడి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబీకులు, బంధువులు నడుములోతులో ఉన్న నీటిలో వెళ్లాల్సి వచ్చింది. ఖరీఫ్‌లోనూ ఇలాగే ఉంటే 25 ఎకరాల పల్లపు భూముల్లోని పంటలు మునిగిపోతాయని, అధికారులు గుత్తేదారుకు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కల్వర్టు ఏర్పాటు చేయాలని కోరారు.

న్యూస్‌టుడే, గజపతినగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని