logo

విజయనగరమే

ఎప్పుడో మే నెలలో ప్రతాపం చూపాల్సిన ఎండలు మార్చిలోనే దడదడలాడిస్తున్నాయి. ఏప్రిల్‌లో మరింత ముదరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Published : 30 Mar 2024 02:50 IST

మార్చిలోనే  మే నెల ఎండలు

న్యూస్‌టుడే-రాజాం: ఎప్పుడో మే నెలలో ప్రతాపం చూపాల్సిన ఎండలు మార్చిలోనే దడదడలాడిస్తున్నాయి. ఏప్రిల్‌లో మరింత ముదరనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సూర్యుడు పొద్దు పొడిచింది మొదలు ఎండలు సుర్రుమంటూ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బయటకు రానివ్వడం లేదు. ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఏసీలు, పంకాలు వేయాల్సి వస్తుండడంతో విద్యుత్తు వాడకం పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో గరిష్ఠంగా 34 డిగ్రీల వరకూ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రాత్రి సమయాల్లో 24 డిగ్రీల వరకూ ఉంటోంది. గడిచిన వారం కంటే పగటి ఉష్ణోగ్రతలు 5, రాత్రి 4 డిగ్రీల వరకూ పెరగడంతో జనం అల్లాడిపోతున్నారు. మున్ముందు 40 డిగ్రీలు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని