logo

శిథిలావస్థలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకు

మండలంలోని తుమరాడ గ్రామంలో రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించిన రక్షిత తాగునీటి పథకం ఓవర్‌హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది.

Published : 09 May 2024 17:44 IST

బలిజిపేట: మండలంలోని తుమరాడ గ్రామంలో రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించిన రక్షిత తాగునీటి పథకం ఓవర్‌హెడ్‌ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది. దీని పైకప్పుపై జువ్వి మొక్కలు మొలుస్తూ ట్యాంకునకు శిథిలం చేస్తున్నాయి. దీని స్థానంలో అదనపు ట్యాంకు నిర్మించాలని ఎంతో కాలంగా ఇక్కడ సర్పంచులు కొనసాగుతున్నా.. వారంతా ఉన్నతాధికారులను అభ్యర్థించారు. నేటివరకు ఇది కార్యరూపం దాల్చలేదు. అదనపు ట్యాంకు నిర్మించాలని గ్రామస్థులను నీటిసరఫరా విభాగం అధికారులను కోరుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని