logo

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టరు నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు.

Published : 10 May 2024 02:30 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టరు నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని సహాయ రిటర్నింగ్‌ అధికారులతో గురువారం వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. సోమవారం జరిగే పోలింగ్‌కు సామగ్రి పంపిణీ, రవాణా తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఏ దశలోనూ పొరపాట్లు, లోపాలకు తావివ్వకుండా విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సెక్టార్‌ సిబ్బంది వెంటనే రిటర్నింగ్‌ అధికారులకు తెలియజేయాలని సూచించారు. పోలింగు కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆరోగ్య సహాయకులు, ఆశా కార్యకర్తలు విధుల్లో ఉండాలన్నారు. హింసాత్మక సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్‌ పూర్తయిన అనంతరం సామగ్రిని అప్పగించే సమయంలోనే నిర్దేశిత ఫారాలు తనిఖీ చేయాలని కోరారు. సంయుక్త కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌ శోబిక, డీఆర్వో కేశవనాయుడు, కమాండ్‌, కంట్రోల్‌ ఇన్‌ఛార్జి సూర్యనారాయణ, అరకు పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని