logo

అతిరథుల మార్గం.. అడుగడుగునా అధ్వానం!

మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం.

Published : 10 May 2024 02:59 IST

నేతలు పట్టించుకోని విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారి
న్యూస్‌టుడే, చీపురుపల్లి, గరివిడి

మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం. నిత్యం సరకుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అడుగడుగునా శిథిలమై.. గోతులతో నిండిపోయిన ఈ రహదారి మరమ్మతులపై నేతలెవరూ అయిదేళ్లుగా దృష్టిసారించలేదు.

మూడు జిల్లాలకూ కీలకం..

విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి అతి కీలకమైన విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారి వైకాపా ప్రభుత్వం పుణ్యమా అని అతుకుల బొంత మాదిరిగా తయారైంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాకు ఈ రహదారి   నిత్యం వేలాదిగా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. విజయనగరం నుంచి నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి, రాజాం మీదుగా ఈ రహదారి సాగుతోంది. విజయనగరం నుంచి గరివిడి వరకు అక్కడక్కడ కొంత మినహా మిగతా రహదారి గోతులు, గతుకులమయమైంది.

విజయనగరం శివారు నుంచి నెల్లిమర్ల వరకు రోడ్డు ఎక్కడికక్కడ గోతులు పడి, పెచ్చులూడిపోయింది. నెల్లిమర్ల పట్టణంలో రోడ్డు మరింత శిథిలమైంది. గుర్ల నుంచి గరివిడి వరకు ఇదే దుస్థితి. ఈ రహదారిపై అటు విశాఖపట్నం, విజయనగరం, ఇటు పాలకొండ, రాజాం, ఒడిశా వాసులు రాకపోకలు సాగిస్తుంటారు. రాళ్లు తేలి, గోతులు కావడంతో రాత్రి వేళల్లో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను విజయనగరం, విశాఖపట్నం తరలించాలంటే ఈ రహదారిపైనే ప్రయాణించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేసినా.. వరదలు, వాహనాల తాకిడికి మళ్లీ అధ్వానంగా తయారవుతోంది. ఈ రహదారి పునర్నిర్మాణంపై వైకాపా ప్రభుత్వం గడిచిన 59 నెలలుగా పట్టించుకున్న దాఖలాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు