logo

వ్యాపారి వంచన

గత కొన్నేళ్లుగా గ్రామస్థుల నుంచి అప్పులు తీసుకోవడంతోపాటు ధాన్యం సైతం కొనుగోలుచేసి తిరిగి చెల్లించకుండా ఓ వ్యక్తి భారీ స్థాయిలో మోసగించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శనివారం దర్శి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 22 May 2022 03:06 IST

రూ.3 కోట్లకు పైగా మోసపోయామంటూ బాధితుల ఫిర్యాదు


ఎస్సై చంద్రశేఖర్‌కు గోడు వినిపిస్తున్న త్రిపురసుందరీపురం వాసులు  

దర్శి, న్యూస్‌టుడే: గత కొన్నేళ్లుగా గ్రామస్థుల నుంచి అప్పులు తీసుకోవడంతోపాటు ధాన్యం సైతం కొనుగోలుచేసి తిరిగి చెల్లించకుండా ఓ వ్యక్తి భారీ స్థాయిలో మోసగించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. శనివారం దర్శి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ.3 కోట్లకు పైగా మోసం జరిగినట్లు వారు చెబుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. దర్శి మండలంలోని త్రిపురసుందరీపురం గ్రామానికి చెందిన బొల్లా శేషయ్య చీమకుర్తిలోని మర్రిచెట్లపాలెంలో ఎరువులు, పురుగుమందుల వ్యాపారం చేస్తుంటారు. గ్రామస్థులు ఆయనను నమ్మి వడ్డీకి డబ్బులు ఇవ్వడంతో పాటు పండిన ధాన్యాన్ని కూడా అమ్ముతుంటారు. ఆ వచ్చిన నగదు కూడా శేషయ్య వద్దే దాచి ప్రామిసరీ నోట్లు రాయించుకున్నారు. ఇలా గ్రామంలోనే దాదాపు రూ.కోటికి పైగా ప్రజలనుంచి ఆయన అప్పులు తీసుకున్నట్లు సమాచారం. సమీప గ్రామాల నుంచి ఇదే రీతిలో తీసుకున్నట్లు మరికొందరు బాధితులు చెబుతున్నారు. హోల్‌సేల్, రిటైల్‌ కంపెనీల వారు కూడా ఎరువులు, పురుగుమందులు ఇచ్చారు. ఇలాంటి అప్పులు మరో రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వారం రోజులుగా ఆయన కనిపించకపోవడంతో దాదాపు 25 మంది శనివారం పోలీసులను ఆశ్రయించారు. వీరిలో సంగన పెద వెంకటేశ్వర్లు, అతని బంధువుల నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదుచేసినట్లు ఎస్సై చంద్రశేఖర్‌ తెలిపారు. మిగిలిన వారి వద్ద ప్రామిసరీ నోట్లు ఉన్నందున కోర్టును ఆశ్రయించాలని సూచించినట్లు తెలిపారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు ఇవ్వకుంటే బాధితులు ఫిర్యాదు చేసిన ఎడల కేసులు నమోదు చేస్తామని తెలిపారు. 


వ్యాపారి శేషయ్య 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు