logo

ప్రాధాన్యతా రంగాలకు రుణాలివ్వాలి

జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు విరివిగా రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ బ్యాంకర్లకు సూచించారు. ప్రకాశం భవన్‌లో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు

Published : 26 May 2022 06:47 IST

బ్యాంకర్లకు కలెక్టర్‌ సూచన

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు విరివిగా రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ బ్యాంకర్లకు సూచించారు. ప్రకాశం భవన్‌లో బుధవారం జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు ఆర్థిక సాయం చేయడంలో ముందంజలో ఉండాలన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు జులై 15వ తేదీ నుంచి నాగార్జున సాగర్‌ ద్వారా నీరు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ సీజన్‌ ముందుగానే ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రానికి ఒక బ్యాంకు శాఖను అనుసంధానం చేయాలన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను కూడా సంతృప్తికర స్థాయిలో మంజూరు చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాల్లోనూ ఉంటే వారికి రూ.35 వేల ప్రత్యేక ఆర్థిక సహాయం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌బీవో సాయిచరణ్‌, కెనరాబ్యాంకు ఆర్‌.ఎం.మారుతీ శశిధర్‌, పీడీసీసీ బ్యాంకు సీఈవో సత్యవతి, నాబార్డు డీడీఎం వెంకట రమణ, డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారిణి బేబిరాణి, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, చేనేత, జౌళిశాఖ అధికారి ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

రుణ మంజూరుకు ప్రణాళిక

2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.14,590.81 కోట్ల రుణాలు మంజూరు చేయాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు ఎల్‌డీఎం యుగంధర్‌రెడ్డి తెలిపారు. 2021-22 సంవత్సర రుణ ప్రణాళికలో 93 శాతం రుణాలు ఇచ్చినట్లు ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని