logo

స్పందన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం

స్పందన అర్జీల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పవిత్ర పంక్షన్‌ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 150 అర్జీలు వచ్చాయి.

Published : 25 Jun 2022 03:15 IST


మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, పక్కనే ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌

కనిగిరి, న్యూస్‌టుడే: స్పందన అర్జీల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పవిత్ర పంక్షన్‌ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 150 అర్జీలు వచ్చాయి. సీఎస్‌పురం మండలం నుంచి అధికంగా సమస్యలు రావడంతో కలెక్టర్‌ అక్కడి రెవెన్యూ యంత్రాంగపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పునరావృతమైతే చర్యలు తప్పని హెచ్చరించారు. కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల నుంచి భూసమస్యలు, ఆన్‌లైన్‌ సమస్యపై అర్జీలు ఎక్కువగా రావడంతో రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో వీటికి పరిష్కారం చూపాలని జిల్లా కేంద్రం వరకు ప్రజలను తిప్ప వద్దని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మాట్లాడుతూ ప్రజలు అర్జీలను అధికారులు తాత్సారం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసులు, ఆర్డీవో కె.సందీప్‌కుమార్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు సరళా వందనం, గ్లోరియా, విజిలెన్స్‌ డిప్యూటీ కలెక్టర్‌ నారదముని, ఎంపీపీ దంతులూరి ప్రకాశం, జడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని