logo

మెప్పించిన నాట్య మయూరాలు

జాతీయ స్థాయి భరత నాట్యం పోటీల్లో మార్కాపురం విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఏకంగా 17 అవార్డులను గెలుచుకుని శెభాష్‌ అనిపించారు. రాజమహేంద్రవరంలో ఈ

Published : 29 Jun 2022 02:38 IST

అవార్డులు సాధించిన చిన్నారులతో శిక్షకురాలు ప్రతిమా సునీల్‌కుమార్‌ తదితరులు

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి భరత నాట్యం పోటీల్లో మార్కాపురం విద్యార్థినులు ప్రతిభ చూపారు. ఏకంగా 17 అవార్డులను గెలుచుకుని శెభాష్‌ అనిపించారు. రాజమహేంద్రవరంలో ఈ నెల 22 నుంచి 26 వరకు జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తమిళనాడు, దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 2400 మంది విద్యార్థినులు తరలివచ్చి పోటీ పడ్డారు. సబ్‌ జూనియర్స్‌ విభాగంలో మార్కాపురం పట్టణానికి చెందిన లాస్య మొదటి, యాషికా రెండో స్థానంలో నిలిచారు. అవంతిక, సహస్ర, రిజ్వానాలు ఏకంగా 8 ప్రత్యేక బహుమతులను సొంతం చేసుకున్నారు. జూనియర్స్‌ విభాగంలో జాహ్నవి, సాన్విక రెండు, మూడు స్థానాలు సాధించగా.. మధుమిత, భవిఘ్న, హర్షిని, నిఖిత ప్రత్యేక బహుమతులు అందుకున్నారు. సీనియర్స్‌ విభాగంలో తేజోసాయి ప్రత్యేక బిహుమతి, ప్రవీణ, సౌభాగ్య, లక్ష్మి, సునీల్‌, సంజనాలు ఓపెన్‌ కేటగిరీలో విజేతలుగా నిలిచారు. కథక్‌ నృత్యంలో భాషిత ప్రత్యేక బహుమతి సాధించినట్టు శిక్షకురాలు ప్రతిమా సునీల్‌కుమార్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని