logo

అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

సేద్యం కలిసి రాక... అప్పులు తీరే మార్గం కానరాక... ఓ రైతు బలవన్మరణం చెందారు. దర్శి మండలం కొత్తపల్లిలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ రాంబాబు తెలిపిన

Published : 09 Aug 2022 01:43 IST

దర్శి, న్యూస్‌టుడే: సేద్యం కలిసి రాక... అప్పులు తీరే మార్గం కానరాక... ఓ రైతు బలవన్మరణం చెందారు. దర్శి మండలం కొత్తపల్లిలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుందురు పెద వెంకటేశ్వర్లు (71)... తమకున్న అయిదెకరాలకు తోడు, మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకుని కంది, వరి సాగు చేస్తున్నారు. గత మూడేళ్లుగా వాతావరణం అనుకూలించక.. వచ్చిన కాస్త పంటకు తగిన ధర లభించక నష్టపోయారు. మరోవైపు చేపల చెరువులోనూ భాగస్వామిగా ఉండి పెట్టుబడి పెట్టారు. అదీ కలిసి రాలేదు. రూ.15 లక్షల మేర అప్పులు మిగిలాయి. రుణం తీర్చే దారి లేక గత కొన్నాళ్లుగా ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగారు. తరువాత... కుటుంబసభ్యులు విషయం గుర్తించి వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని