logo

లోక్‌ అదాలత్‌లో 6,900 కేసులు పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా సుమారు 6,900 కేసులు పరిష్కరించారు. వీటిలో 350 సివిల్‌, 6,550 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కక్షిదారులకు దాదాపు రూ.2.50 కోట్లను పరిహారం రూపంలో అందజేశారు.

Published : 14 Aug 2022 02:31 IST


ప్రసంగిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి.. వేదికపై అదనపు జిల్లా
న్యాయమూర్తి ఆర్‌.శివకుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా సుమారు 6,900 కేసులు పరిష్కరించారు. వీటిలో 350 సివిల్‌, 6,550 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. కక్షిదారులకు దాదాపు రూ.2.50 కోట్లను పరిహారం రూపంలో అందజేశారు. ఒంగోలులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి మాట్లాడారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ సూచనల ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌ అదాలత్‌ ద్వారా అప్పీలుకు అవకాశం లేని అంతిమ తీర్పు పొందవచ్చన్నారు. సత్వర న్యాయం అందరికీ చేరువ కావాలన్న ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. న్యాయస్థానాల్లో చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 25 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా న్యాయమూర్తులు ఆర్‌.శివకుమార్‌, ఎం.సోమశేఖర్‌, డి.అమ్మనరాజా; సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులు కె.సత్యకుమారి, ఎస్‌.జయలక్ష్మి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని