logo

నేరాలు... ప్రమాదాలు

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు గత పది రోజులుగా ఆటోనగర్‌లో నివాసముంటూ... ద్విచక్ర వాహనాలపై ఊరూరా తిరుగుతూ

Published : 30 Sep 2022 06:39 IST

చికిత్స పొందుతూ మధ్యప్రదేశ్‌ వాసి మృతి

ఒంగోలు గ్రామీణం: ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు గత పది రోజులుగా ఆటోనగర్‌లో నివాసముంటూ... ద్విచక్ర వాహనాలపై ఊరూరా తిరుగుతూ ప్లాస్టిక్‌ సామగ్రి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి... మధ్యప్రదేశ్‌కు చెందిన దేవకిషన్‌ (35) సామగ్రి అమ్ముకుని ద్విచక్ర వాహనంపై ఒంగోలు నుంచి ఆటోనగర్‌కు వస్తున్నారు. మండువవారిపాలెం వద్ద... సర్వీసు రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో వాహనం ఆయనను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయనను 108 వాహనంలో ఒంగోలు సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.


విద్యుదాఘాతంతో కార్మికుడి దుర్మరణం

కనిగిరి, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో సెంట్రింగ్‌ కార్మికుడొకరు మృతి చెందారు. కనిగిరి పట్టణం పాతూరులో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు మండలం బుక్కాపురానికి చెందిన వెంగళరావు (25)... కనిగిరి పట్టణం శంకవరంలో ఉంటూ సెంట్రింగ్‌ పనులు చేస్తున్నారు. రోజూ మాదిరిగానే పాతూరులో నిర్మిస్తున్న భవనం శ్లాబ్‌కు సెంట్రింగ్‌ కడుతుండగా... ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్తు తీగ తగిలి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కొనఊపిరితో ఉన్న ఆయనను సామాజిక వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్సై డి.ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని