మొదట పాక.. ఆపై పాగా!
ఒంగోలు ఉత్తర బైపాస్‌లోని బీఎంఆర్ ఇన్‌ఫ్రా సమీపంలో వాగు స్థలం ఉంది. సర్వే నం.260, 262లో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. ఇందులో సుమారు 20 మంది ఆదివారం రాత్రికి రాత్రే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఉత్తర బైపాస్‌లోని ఖాళీ స్థలంలో రాత్రికి రాత్రే ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారాలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు ఉత్తర బైపాస్‌లోని బీఎంఆర్ ఇన్‌ఫ్రా సమీపంలో వాగు స్థలం ఉంది. సర్వే నం.260, 262లో దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో భూములున్నాయి. ఇందులో సుమారు 20 మంది ఆదివారం రాత్రికి రాత్రే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. బైపాస్ సమీపంలో ఉన్న ఈ స్థలం అత్యంత విలువైనది. ఈ భూములపై ఎప్పటి నుంచో కొందరు అధికార పార్టీ నాయకుల కళ్లున్నాయి. తాజాగా వెలసిన గుడారాల వెనుక కూడా వారి హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ మురళి సంబంధిత స్థలాన్ని, అందులోని ఆక్రమణలను పరిశీలించారు. రెవెన్యూ దస్త్రాల ఆధారంగా ఆ ప్రాంతంలో వాగు ఉందని.. నిబంధనల ప్రకారం ఆక్రమించడం నేరమని చెప్పారు. ఇళ్ల పట్టాలు ఇచ్చినా చెల్లుబాటు కావని తెలిపారు. కానీ ఆక్రమణదారులు తమ వద్ద పట్టాలు ఉన్నట్లు తహసీల్దార్ మురళికి సమాచారం ఇవ్వడం గమనార్హం. దీంతో మంగళవారం వరకు పట్టాలు తీసుకొచ్చేందుకు వారికి గడువు విధించారు. అనంతరం స్థలం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ఇది సాధ్యమైంది: మోదీ
-
Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న తెదేపా
-
YouTube: క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్.. వీడియో ఎడిటింగ్‌కు ఫ్రీ యాప్
-
Agent: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్ అస్త్రను సాధించేది ఎవరు?