logo

రాములోరి వేడుక విషయంలో..అధికార పార్టీలో ఇరువర్గాల దాడులు

దేవుని వేడుక నిర్వహణలోనూ వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో అక్కడివారు భయభ్రాంతులకు గురయ్యారు.

Published : 17 Apr 2024 03:34 IST

నలుగురికి తీవ్ర గాయాలు

గాయపడిన మల్లికార్జునరెడ్డి, వరమ్మ

న్యూస్‌టుడే, పెద్దారవీడు :  దేవుని వేడుక నిర్వహణలోనూ వైకాపా నాయకులు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో అక్కడివారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన పెద్దారవీడు మండలంలోని చట్లమిట్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...గ్రామంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కల్యాణంలో  దంపతులు కూర్చొని పూజలు చేసేందుకు వేలంపాట నిర్వహించగా ఏర్వ అల్లూరి రెడ్డి దక్కించుకున్నారు. అయితే ఆయన కాకుండా, మరో వ్యక్తి స్వామివారి కల్యాణానికి కూర్చుంటారని ప్రకటించారు. దీనిపై సర్పంచ్‌ వర్గం వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు నిలదీయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారడంతో ఇరు వర్గాల వారు రాళ్లు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులు చేసుకున్నారు. ఇందులో ఏర్వ అల్లూరిరెడ్డి, కుందురు మల్లికార్జున రెడ్డి, కుందురు వెంకట రెడ్డి, వరమ్మకు తీవ్ర గాయాలు కాగా, మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట సైదులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని