logo

పెరిగిన నీటిమట్టం.. పంటకు నష్టం

నాగావళిలో నీటిమట్టం శనివారం ఆకస్మికంగా పెరిగింది. దీంతో ఒక్కసారిగా బూర్జ మండలం పరిధిలో ఉన్న ఆరు ఓపెన్‌ హెడ్‌ కాలువల నుంచి పంట పొలాల్లోకి నీరు చేరింది. పువ్వు, కాయతో ఉన్న అపరాల పంటకు ఇది నష్టం కలిగించేదే. వరికుప్పలు అడుగుభాగంలో నీరు చేరింది. కుప్పలు కూడా పాడవుతాయని రైతులు

Published : 17 Jan 2022 04:04 IST


నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళిలో వరదనీరు

బూర్జ, న్యూస్‌టుడే: నాగావళిలో నీటిమట్టం శనివారం ఆకస్మికంగా పెరిగింది. దీంతో ఒక్కసారిగా బూర్జ మండలం పరిధిలో ఉన్న ఆరు ఓపెన్‌ హెడ్‌ కాలువల నుంచి పంట పొలాల్లోకి నీరు చేరింది. పువ్వు, కాయతో ఉన్న అపరాల పంటకు ఇది నష్టం కలిగించేదే. వరికుప్పలు అడుగుభాగంలో నీరు చేరింది. కుప్పలు కూడా పాడవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షట్టర్లు తుప్పుపట్టి దెబ్బతినడంతోనే కాలువల్లోకి వరదనీరు వచ్చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై జలనవరుల శాఖ ఎస్‌ఈ పొన్నాడ సుధాకర్‌ మాట్లాడుతూ ఒడిశాలో కురిసిన వర్షాల కారణంగా తోటపల్లి, మడ్డువలస జలాశయాల నుంచి 16 వేల క్యూసెక్కుల నీటిని నాగావళిలోకి విడుదల చేశారన్నారు. దీంతో నీటిమట్టం పెరిగిందని, నష్టం లేకుండా జాగత్తలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని