logo

ఊరంతా పెళ్లిసందడి..

వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో గురువారం జరగనున్న సామూహిక పెళ్లిళ్ల సందడి మొదలైంది. బుధవారం ఉదయం 6.30 గంటలకు బాజాభజంత్రీలతో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సుమారు 86 (43 జంటలు) పెళ్లి ఇళ్ల వద్ద పందిరాట అట్టహాసంగా నిర్వహించారు.

Published : 12 May 2022 06:18 IST

- న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

గ్రామంలో నృత్యాలతో యువకుల సందడి

వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో గురువారం జరగనున్న సామూహిక పెళ్లిళ్ల సందడి మొదలైంది. బుధవారం ఉదయం 6.30 గంటలకు బాజాభజంత్రీలతో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ సుమారు 86 (43 జంటలు) పెళ్లి ఇళ్ల వద్ద పందిరాట అట్టహాసంగా నిర్వహించారు. పచ్చని కొబ్బరి కమ్మలతో పందిర్లు వేసి పెళ్లి పీటలను సిద్ధం చేశారు. అనంతరం డీజే సంగీతానికి యువకులు, చిన్నారులు, మహిళలు నృత్యాలు చేస్తూ రంగేళి ఆడారు. ఊరంతా హోలీ సందడి నెలకొంది. సంప్రదాయబద్ధంగా సమీప మంచినీటి కోనేరు వరకు ఊరేగింపుగా వెళ్లి స్నానాలు చేశారు. ఉల్లాసభరితంగా సాగింది. మధ్యాహ్నం వధూవరులకు మేనమామలు పుట్టి కావడితో సారె సామగ్రి అందజేశారు. గ్రామంలోని అన్ని వీధుల్లో విద్యుద్దీపాలంకరణలు, పెళ్లి ఆహ్వాన ఫ్లెక్సీలతో అందంగా తీర్చిదిద్దారు.

వీధుల్లో విద్యుత్తు దీపాల వెలుగులు..

ముత్యాల పందిరిలో అలంకరణలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని