logo

సేవాదృక్పథంతో కూడిన బోధన అందించాలి

ప్రత్యేక అవసరాల గల చిన్నారులకు సేవా దృక్పథంతో కూడిన ఉపాధ్యయ విద్యను బోధించాలని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీ విద్యా విభాగంలో వీడ్కోలు, స్వాగత వేడుకులను బుధవారం నిర్వహించారు.

Published : 26 May 2022 06:22 IST

ప్రసంగిస్తున్న ఉపకులపతి నిమ్మ వెంకటరావు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: ప్రత్యేక అవసరాల గల చిన్నారులకు సేవా దృక్పథంతో కూడిన ఉపాధ్యయ విద్యను బోధించాలని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.నిమ్మ వెంకటరావు అన్నారు. వర్సిటీ విద్యా విభాగంలో వీడ్కోలు, స్వాగత వేడుకులను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు విద్య దోహదపడుతుందన్నారు. విద్యను అన్ని వర్గాల వారికి అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక అవసరాలుగల వారి కోసం స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. వర్శిటీ రిజిస్ట్రార్‌ డా.సి.హెచ్‌.ఏ.రాజేంద్రప్రసాద్‌, విద్యావిభాగం సమన్వయకర్త డా.ఎన్‌.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు జె.ఎల్‌.సంధ్యారాణి, హెచ్‌.సుబ్రహ్మణ్యం, ఎన్‌.స్వామినాయుడు, కె.లలిత, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని