logo

ఏపీటీపీసీఏ కార్యదర్శిగా శ్రీనివాసరావు

ఏపీ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌, కన్సల్టెంట్‌ సంఘ(ఏపీటీపీసీఏ) కార్యదర్శిగా బుడుమూరు శ్రీనివాసరావు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ భాషా ఆధ్వర్యంలో

Published : 27 Jun 2022 06:09 IST

ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీనివాసరావు, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌భాషా

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌, కన్సల్టెంట్‌ సంఘ(ఏపీటీపీసీఏ) కార్యదర్శిగా బుడుమూరు శ్రీనివాసరావు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌.బి.అంజాద్‌ భాషా ఆధ్వర్యంలో ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యులతో పాటు తమ వద్ద పనిచేస్తున్నవారికి ఏ సహాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రభుత్వం తమ సంఘ కార్యాలయ నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పి.రవీంద్రరెడ్డి, సంఘ జాతీయ అధ్యక్షుడు కె.సీతాపతి, సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని