logo

రీసర్వేకు నిధులు సమకూర్చండి

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వేకు నిధుల సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం నిధులను సమకూర్చాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టర్‌ శ్రీకేష్‌

Published : 27 Sep 2022 06:27 IST

మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు, చిత్రంలో ఇతర నాయకులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూముల రీసర్వేకు నిధుల సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం నిధులను సమకూర్చాలని రాష్ట్ర రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ ఎం.విజయసునీతలను సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం రెవెన్యూ సర్వీసుల సంఘ అతిథిగృహంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రీసర్వేకు వినియోగిస్తున్న కొలత రాళ్లు, జిరాక్సులకు రూ.లక్షలు ఖర్చవుతోందన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంతకముందు శ్రీకాకుళం తహసీల్దార్‌ కార్యాలయంలో రీసర్వేలో ఎదురువుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సమావేశంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వేణుగోపాలరావు, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, కార్యదర్శి బి.వి.వి.ఎన్‌.రాజు, జిల్లా ప్రతినిధులు పి.శ్రీనివాసరావు, జి.ఎల్‌.శ్రీనివాసరావు, దిలీప్‌ చక్రవర్తి, ప్రవల్లిక, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని