logo

లబ్ధిదారులకు ఉపకరణాల పంపిణీ

వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉపకరణాలను పంపిణీ చేశారు. వాటికి సంబంధించిన పత్రాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ ఎం.నవీన్‌, ఎస్పీ రాధిక లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Updated : 27 Jan 2023 05:38 IST

లబ్ధిదారుడికి పత్రం అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, చిత్రంలో ఎస్పీ రాధిక, తదితరులు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఉపకరణాలను పంపిణీ చేశారు. వాటికి సంబంధించిన పత్రాలను కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జేసీ ఎం.నవీన్‌, ఎస్పీ రాధిక లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఏపీఎంఐపీ ద్వారా పది మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల విలువైన పరికరాలు ఇచ్చారు. కొబ్బరి, పామాయిల్‌, అరటి, కూరగాయల సాగు చేసే రైతులకు 90 శాతం రాయితీ కల్పించారు. మత్స్యశాఖ తరఫున అయిదుగురు లబ్ధిదారులకు మోటారు సైకిళ్లు, చేపల రవాణా, విక్రయాలకు ఉపయోగపడే సామగ్రి, రూ.22 లక్షల విలువైన లైవ్‌ఫిష్‌ వెండింగ్‌ యూనిట్ను రూ.12 లక్షల రాయితీతో అందించారు. డీఆర్‌డీఏ ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని