logo

సెక్టార్‌ అధికారులు బాధ్యతతో పని చేయాలి

ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్‌ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్‌ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు.

Published : 29 Mar 2024 04:44 IST

జలుమూరు: ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌

జలుమూరు, న్యూస్‌టుడే: ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సెక్టార్‌ అధికారులు బాధ్యతతో పని చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ అన్నారు. జలుమూరు రెవెన్యూ కార్యాలయంలో క్లస్టర్‌ అధికారులకు గురువారం పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాలు క్లస్టర్‌ పరిధికి ఎంత దూరంలో ఉన్నాయి.. అక్కడకు రవాణా సౌకర్యం, తదితర అంశాలపై ఆరా తీశారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద ఓటింగ్‌పై అధికారులకు సూచనలు చేశారు. గ్రామ వాలంటీర్లు ప్రచారాల్లో పాల్గొనకూడదని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వసతులను అడిగి తెలుసుకున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండాలన్నారు. పోలింగ్‌ శాతం 80 కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ఎంసీసీ నోడల్‌ అధికారి కృష్ణారావు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారుల  తనిఖీలను పరిశీలించి నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. నియోజకవర్గ ఆర్‌వో రామ్మోహనరావు, ఎన్నికల డీటీ శరత్‌, తహసీల్దారు సిహెచ్‌ నాగమ్మ, డీటీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ సతీష్‌కుమార్‌, ఎంపీడీవో దామోదరరావు, ఈవోపీఆర్డీ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన : సారవకోట, పోలాకి, న్యూస్‌టుడే: సారవకోట, పోలాకి మండల్లాలోని పలు పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ గురువారం పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎల్వోలకు సూచించారు. పోలింగ్‌ కేంద్రాల్లోని సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొదట రెవెన్యూ కార్యాలయంలో ఎన్నికల ఏర్పాట్లపై నరసన్నపేట నియోజకవర్గ ఆర్వో రామ్మోహనరావు, తహసీల్దార్‌ పి.భాగ్యవతి, ఎస్సై జి.అప్పారావుతో సమావేశమై సూచనలిచ్చారు. అనుమతులు లేకుండా ఎన్నికల ప్రచారాలు చేస్తే నోటీసులివ్వాలని ఆదేశించారు. పోలాకి మండల పరిధి నరసాపురం పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. తాగునీరు, ఐఎస్‌ఎల్‌, భవనాలకు విద్యుత్తు సదుపాయాలపై వీఆర్‌వో శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ ఎల్‌వీ ప్రసాద్‌కు పలు సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని