logo

తెదేపాలోకి జోరుగా చేరికలు

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్‌ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్‌ సమక్షంలో తేదేపాలో చేరాయి.

Published : 28 Apr 2024 03:45 IST

పొందూరు: లక్ష్మిపేటలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా శ్రేణులు

పొందూరు, గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్‌ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్‌ సమక్షంలో తేదేపాలో చేరాయి. అలాగే పొందూరు పట్టణంలో 40 కుటుంబాలు వైకాపా నుంచి తెదేపాలోకి చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్‌-6 పథకాలకు జనంలో ఆదరణ లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రామ్మోహన్‌, పట్టణ అధ్యక్షుడు చినరంగ, శంకర్‌భాస్కర్‌, బాడాన  శేషగిరినాయుడు, ఎంపీటీసీ సభ్యులు ఎ.వాణి, బాడాన హారిక, విజయలక్ష్మి, తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు. 

  • శ్రీకాకుళం నగరంలోని 26వ డివిజన్‌లో శ్రీశయన సామాజిక వర్గం నుంచి సంఘ నేత రాయిపిల్లి అర్జున్‌ నాయకత్వంలో పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. స్థానిక రామమందిరం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాకుళం అసెంబ్లీ కూటమి ఎమ్యెల్యే అభ్యర్థి గొండు శంకరరావు సమక్షంలో 400 మంది తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. డివిజన్‌ ఇన్‌ఛార్జి ఉంగటి వెంకటరమణ పాల్గొన్నారు.
  • శ్రీకాకుళం పురపాలిక మాజీ ఛైర్మన్‌ దివంగత అంధవరపు వరహా నరసింహం కుటుంబం ఆదివారం వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకోనుంది. ఈ విషయాన్ని వరం తనయుడు అంధవరపు ప్రసాద్‌ తెలిపారు. 2000 నుంచి 2005 వరకు తన సోదరి పైడిశెట్టి జయంతి తెదేపా హయాంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా సేవలందించారని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌- 6 పథకాల వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని విశ్వసిస్తూ తెదేపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. నాన్న అభిమానులు, సన్నిహితులు అభిప్రాయం మేరకు ఆదివారం ఉదయం 9 గంటలకు ఎంపీ రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గొండు శంకరరావు సమక్షంలో తనతో పాటు జయంతి, సోదరుడు సంతోష్‌ పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని