logo

కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌

కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారు చేసే ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని మంత్రి మెయ్యనాథన్‌ తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ భద్రత గురించి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన సమీక్షా సమావేశం, సదస్సు చెన్నై గిండిలో శనివారం జరిగింది.

Published : 22 May 2022 04:43 IST

కార్యక్రమంలో పాల్గొన్న భూపేంద్ర యాదవ్‌, మెయ్యనాథన్‌ తదితరులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారు చేసే ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని మంత్రి మెయ్యనాథన్‌ తెలిపారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ భద్రత గురించి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన సమీక్షా సమావేశం, సదస్సు చెన్నై గిండిలో శనివారం జరిగింది. కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌, కేంద్ర సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే, రాష్ట్ర మంత్రి మెయ్యనాథన్‌ తదితరులు పాల్గొన్నారు. భూపేంద్ర యాదవ్‌ మాట్లాడుతూ... తిరుక్కురల్‌ జీవితానికి సంబంధించిన పుస్తకం అని, దీనిని పాటిస్తే ఉన్నతస్థానం సాధించవచ్చని పేర్కొన్నారు. గాలి స్వచ్ఛతను మెరుగుపరచాలంటే అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేయాలన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మెయ్యనాథన్‌ మాట్లాడుతూ.... రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 రకాల ప్లాస్టిక్‌ ఉత్పత్తులకు నిషేధం విధించారని తెలిపారు. పసుపు సంచి పథకాన్ని ముఖ్యమంత్రి తీసుకొచ్చారన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కొత్త సంస్థను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోయంబేడు మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్‌ తయారు చేసే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని