logo

వీధి శునకాల ఆపద్బాంధవుడు

పదేళ్లుగా వీధి శునకాల ఆకలి తీరుస్తున్నారు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ఇంద్రానగర్‌కు చెందిన తిరుమలై వాసన్‌.

Published : 13 Aug 2022 05:45 IST

శునకాలకు ఆహారం అందిస్తున్న తిరుమలై వాసన్‌

తిరుత్తణి, న్యూస్‌టుడే: పదేళ్లుగా వీధి శునకాల ఆకలి తీరుస్తున్నారు తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ఇంద్రానగర్‌కు చెందిన తిరుమలై వాసన్‌. సామాజిక కార్యకర్తయిన ఈయన 2008 నుంచి తిరుత్తణి బస్టాండు, రైల్వేస్టేషన్‌, పాత ధర్మరాజకోవిల్‌ వీధి, కమలా థియేటర్‌ మొదలైన చోట్ల సంచరించే శునకాలకు పాలు, బ్రెడ్‌, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను ఉదయం, సాయంత్రం అందిస్తున్నారు. వాసన్‌ ద్విచక్ర వాహనంపై వచ్చే శబ్దాన్ని వినగానే శునకాలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తాయి. అదేవిధంగా వాటికి గాయాలైన, అనారోగ్యం తలెత్తినా వైద్యం చేయిస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకలికి వీధి శునకాలు పడుతున్న అవస్థలు చూసి ప్రతిరోజు వాటికి ఆహారం అందజేస్తున్నట్లు తెలిపారు. రోజుకు కనీసం రూ.700 ఖర్చు అవుతుందని, అప్పుడప్పుడు వాటికి వైద్య ఖర్చులు అవుతాయన్నారు. అదేవిధంగా తన ఇంట్లో 15 శునకాలను పెంచుతున్నట్లు తెలిపారు. శునకాలు గాయపడితే 89402 70568 నెంబరుపై సంప్రదిస్తే తానే నేరుగా వెళ్లి వాటికి చికిత్స చేయిస్తానని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని