logo

Jayalalitha: జయలలితకు వారసులు ఉండుంటే బాగుండేది: జస్టిస్‌ ఆర్ముగస్వామి

జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రిలో సహాయంగా ఉండే వారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ముగస్వామి వ్యాఖ్యానించారు.

Updated : 28 Nov 2022 11:35 IST

స్నాతకోత్సవంలో పాల్గొన్న జస్టిస్‌ ఆర్ముగస్వామి తదితరులు

సైదాపేట, న్యూస్‌టుడే: జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రిలో సహాయంగా ఉండే వారని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్ముగస్వామి వ్యాఖ్యానించారు. తిరుప్పూరు జిల్లా తారాపురంలో జరిగిన కళాశాల స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జయలలిత మృతి గురించి దిల్లీ ఎయిమ్స్‌ తన నివేదికలో ఎలాంటి అనుమానం లేదని తెలిపిందన్నారు. కానీ జయలలిత గుండె సమస్యే ముఖ్యమైనదని, అలాంటప్పుడు ఆంజియో చేసుండాలని, ఎందుకు చేయలేదన్నదే తన అనుమానమని పేర్కొన్నారు. జయలలిత గుండెలో వెజిటేషియన్‌ అనే కాల్షియం డిపాజిటర్‌, చిన్న ద్వారమూ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఆమెకు శస్త్రచికిత్స చేయాల్సిందన్నదే అందరి అభిప్రాయమన్నారు. ముగ్గురు వైద్యులు జయలలితకు ఆంజియో అవసరం లేదని చెప్పినట్లు, ఒక డాక్టర్‌ శస్త్రచికిత్స అవరం లేదని చెప్పినట్లు ఎయిమ్స్‌ నివేదికలో ఉందన్నారు. అందులో డాక్టర్లు సెరియన్‌, గిరినాథ్‌లు జయలలితను చూసినట్లు ఆధారాలు లేవన్నారు. వైద్యుడు శ్రీధర్‌ తాను చెప్పలేదని సాక్ష్యం ఇచ్చారని అన్నారు. అలాగే వైద్యుడు శ్యామువేల్‌ శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పలేదని వివరించారని తెలిపారు. ఆ ప్రకారం ఎయిమ్స్‌ నివేదికను నిరాకరించానని తెలిపారు. అందుకోసం ఎయిమ్స్‌ ఆస్పత్రిని తాను నిందించటం లేదన్నారు. జయలలితకు వారసులు ఉండుంటే ఆస్పత్రితో సహాయంగా ఉండేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని