logo

సీఎం చొరవతో సింగపూర్‌లా మారనున్న చెన్నై: శేఖర్‌బాబు

చెన్నైని కచ్చితంగా సీఎం స్టాలిన్‌ సింగపూర్‌గా మార్చి చూపిస్తారని దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.

Published : 29 Jan 2023 01:32 IST

దోమల మందు పిచికారి పనులు పరిశీలిస్తున్న మంత్రి

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చెన్నైని కచ్చితంగా సీఎం స్టాలిన్‌ సింగపూర్‌గా మార్చి చూపిస్తారని దేవాదాయశాఖ మంత్రి శేఖర్‌బాబు తెలిపారు. చెన్నై కార్పొరేషన్‌ తిరువికనగర్‌ మండలం ఓట్టేరి కాలువలో డ్రోన్‌ యంత్రాలతో దోమల మందు పిచికారి చేసే పనులను ఆయన శనివారం ప్రారంభించి, పరిశీలించారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... 28 కాలువల్లో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం పూర్తిగా పూడిక తీయడంతో వర్షాలకు నీరు నిల్వని పరిస్థితి ఉందన్నారు. చెన్నైవ్యాప్తంగా అన్ని కాలువలు పూడిక తీయడానికి రూ.2,600 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కొస్తలై చెరువులో 677 కి.మీ. దూరానికి పూడిక తీసేందుకు పనులు చేపట్టామన్నారు. ఇప్పటివరకు 350 కి.మీ. దూరం పూర్తి చేశామన్నారు. చెన్నై వెంటనే సింగపూర్‌గా మారిపోదన్నారు. రెండేళ్లు సరిపోదని, కచ్చితంగా ముఖ్యమంత్రి చెప్పింది చేస్తారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని