logo

దివ్యాంగులకు ఉపయోగపడేలా యాప్‌

పాఠశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌లో పైథాన్‌ కోడ్‌ ద్వారా దివ్యాంగుల సులభంగా కళ్లతో కంప్యూటర్‌లోని ఫైళ్లు ఉపయోగించే విధంగా సొంతంగా యాప్‌ రూపొందించారు తంజావూరు విద్యార్థులు.

Published : 01 Feb 2023 00:32 IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

ఉపాధ్యాయురాలితో కిషోర్‌, శివమారిముత్తు

సైదాపేట, న్యూస్‌టుడే: పాఠశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌లో పైథాన్‌ కోడ్‌ ద్వారా దివ్యాంగుల సులభంగా కళ్లతో కంప్యూటర్‌లోని ఫైళ్లు ఉపయోగించే విధంగా సొంతంగా యాప్‌ రూపొందించారు తంజావూరు విద్యార్థులు. పట్టుకోట్టై ప్రభుత్వ మహోన్నత పాఠశాల విద్యార్థులు కిషోర్‌, శివమారిముత్తు నెలపాటు శ్రమించి పైథాన్‌ కోడింగ్‌ నేర్చుకున్నారు. దివ్యాంగులు సులభంగా కళ్లతో కంప్యూటర్‌లోని ఫైళ్లను నిర్వహించేలా అప్లికేషన్‌ రూపొందించారు. వీరికి ఉపాధ్యాయురాలు సుమిత్ర నేతృత్వం వహించారు. వల్లం పెరియార్‌ మణిమయం సైన్సు, సాంకేతిక విశ్వవిద్యాలయం, పెరియారు శతాబ్ది పాలిటెక్నిక్‌ కళాశాల తరఫున గత నవంబర్‌ 9- 11వ తేదీ వరకు జరిగిన ఓపెన్‌ హౌస్‌ 2022 సైన్సు ప్రదర్శనలో ఉత్తమ ఆవిష్కరణ అవార్డు ఈ విద్యార్థుల యాప్‌నకు దక్కింది. దీంతో లండన్‌ బకింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయంలో పని చేసే పట్టుకోట్టై ప్రభుత్వ మాదిరి పాఠశాల పూర్వ విద్యార్థి వీరికి అసైన్‌మెంట్‌ ఇస్తున్నారు. కిషోర్‌, శివమారిముత్తు మాట్లాడుతూ... తిరుక్కురల్‌ (సూక్తులు) ఆధారంగా కొత్త అభ్యసన పద్ధతి తయారు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని