logo

యోగా పోటీలకు రాష్ట్ర విద్యార్థిని ఎంపిక

అంతర్జాతీయ యోగా పోటీలకు రాష్ట్ర విద్యార్థిని జయవర్ధిని ఎంపికైంది.

Updated : 30 Mar 2023 06:13 IST

సాధించిన పతకాలతో జయవర్ధిని

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే:  అంతర్జాతీయ యోగా పోటీలకు రాష్ట్ర విద్యార్థిని జయవర్ధిని ఎంపికైంది. విరుదునగర్‌  జిల్లా శ్రీవిల్లిపుత్తూర్‌ కమ్మాపట్టికి చెందిన పాలవ్యాపారి కుడియరసు, గీత దంపతుల కుమార్తెలు కవియరసు (16), జయవర్ధిని (12). జయవర్ధిని ఏడో తరగతి చదువుతోంది. ఎనిమిది నెలల్ల్లోనే పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయిలో 30కుపైగా పోటీల్లో గెలుపొందింది. ఇంకా దక్షిణ భారత స్థాయిలో మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అండమాన్‌ నికోబార్‌ దీవులలో జనవరిలో జరిగిన పోటీల్లో 12ఏళ్ల విభాగంలో జయవర్ధిని మొదటిస్థానం పొందింది. తెంకాశీ జిల్లాలో యోగా కల్చరల్‌ కేంద్రం నిర్వహించిన జాతీయ ఛాంపియన్‌షిప్‌-2023 పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచింది. దీని ద్వారా థాయ్‌లాండ్‌లో డిసెంబర్‌లో జరగబోయే అంతర్జాతీయ యోగా పోటీకి ఎంపికైంది. ఇంకా కంబోడియాలో మే 27న జరగనున్న పోటీల్లో పాల్గొననుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని