logo

పూర్తిస్థాయిలో పోస్టుల భర్తీ

రాష్ట్రంలో తొలిసారిగా పోలీసుశాఖలో పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసినట్లు డీజీపీ శైలేంద్రబాబు అన్నారు. నీలగిరి జిల్లాకు ఆయన గురువారం విచ్చేసి కున్నూర్‌, వెలింగ్టన్‌, ఊటీ పోలీస్‌స్టేషన్ల్‌ను పరిశీలించారు.

Updated : 26 May 2023 05:22 IST

పోలీసుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న డీజీపీ శైలేంద్రబాబు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో తొలిసారిగా పోలీసుశాఖలో పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసినట్లు డీజీపీ శైలేంద్రబాబు అన్నారు. నీలగిరి జిల్లాకు ఆయన గురువారం విచ్చేసి కున్నూర్‌, వెలింగ్టన్‌, ఊటీ పోలీస్‌స్టేషన్ల్‌ను పరిశీలించారు. అప్పుడు వివిధ పత్రాలు పరిశీలించారు. ఇంకా పోలీసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... ఊటీలోని గిరిజనులు అధ్యయన కేంద్రం ద్వారా పోలీసుశాఖ సామాజికన్యాయం, మానవహక్కుల విభాగ పోలీసులకు గిరిజనుల సాక్ష్యం, వారి నేరాల నిర్వహణపై  పోలీసులకు రెండురోజుల శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 1.2శాతం గిరిజనులు ఉన్నారనన్నారు. గత ఏడాది వీరిపై దాడులు జరిగాయని 75 కేసులలు నమోదయ్యాయని చెప్పారు. 2,600 గిరిజనుల కుల ధ్రువపత్రాలు సరిచూసినట్లు పేర్కొనన్నారు. నీలగిరిలో వేసవి సీజన్‌ కోసం 900మంది పోలీసులను ఉంచినట్లు తెలిపారు. వాళ్లు ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడకుండా నియంత్రిస్తారన్నారు. ఊటీలోనే కాకుండా మామల్లపురం, ఇతర పర్యటకప్రాంతాల్లో పోలీసులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతేడాది 10 వేల మంది పోలీసులను నియమించినట్లు తెలిపారు. ఇంకా 3,500 మంది పోలీసులు శిక్షణలో చేరారన్నారు. 2,500 మంది నియమితులయ్యారని చెప్పారు. రాష్ట్రంలో తొలిసారిగా పోలీసుశాఖలో పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని