logo

ఇళ్ల కేటాయింపు ఆదేశాల అందజేత

చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గ పరిధిలోని 116, 114వ వార్డుల్లో వాననీటి కాలువల పని సమయంలో ఇళ్లను కోల్పోయిన 20 మందికి పట్టణ నివాస అభివృద్ధి బోర్డు తరఫున ఇళ్లు కేటాయించారు.

Published : 02 Jun 2023 01:02 IST

లబ్ధిదారులతో మంత్రులు ఉదయనిధి, అన్బరసన్‌ తదితరులు

సైదాపేట, న్యూస్‌టుడే: చెన్నై చేపాక్కం-ట్రిప్లికేన్‌ నియోజకవర్గ పరిధిలోని 116, 114వ వార్డుల్లో వాననీటి కాలువల పని సమయంలో ఇళ్లను కోల్పోయిన 20 మందికి పట్టణ నివాస అభివృద్ధి బోర్డు తరఫున ఇళ్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర యువజన సంక్షేమ, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి అన్బరసన్‌, పట్టణ నివాస అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు పట్టణ నివాస అభివృద్ధి బోర్డు అధ్యక్షురాలు అపూర్వ, ఎండీ శంకర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు